Home Page SliderNationalPolitics

డేంజర్‌లో ప్రశాంత్ కిశోర్

జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (48) ఆరోగ్య పరిస్థితి డేంజర్‌లో ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్షను చేస్తున్న ప్రశాంత్ కిశోర్‌ను ఆసుపత్రికి తరలించినా, ఐసీయూ నుండి ఆయన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. అసలు ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం విషమిస్తోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఆయన సాధారణ ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యపరమైన పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైద్యులు హెచ్చరించారని జేఎస్‌పీ అధ్యక్షుడు మనోజ్ భారతి పేర్కొన్నారు. విద్యార్థి బృందంతో ముఖ్యమంత్రి సమావేశమై సమస్యను పరిష్కరిస్తేనే ప్రశాంత్ కిశోర్ దీక్ష విరమిస్తానని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపినట్లు మనోజ్ భారతి వివరించారు. ఇటీవల నిర్వహించిన బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష పత్రం లీకైనందున రద్దు చేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. వారికి మద్దతుగా ప్రశాంత్ కిశోర్ ఈ నెల 2 నుండి నిరాహార దీక్ష చేస్తున్నారు.