ప్రశాంత్ కిశోర్ అరెస్టు
బిహార్ రాష్ట్ర కమిషన్ పరీక్షలు వ్యవహారంలో గత నాలుగు రోజులుగా జన్ సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ పట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ ఘటనలో చట్టవిరుద్ధంగా నిరసన చేపట్టినందువల్ల ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రికి తరలించారు. డిసెంబర్ 13న నిర్వహించిన బీపీఎస్సీ కంబైన్డ్ కాంపిటేటివ్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి, మళ్లీ కొత్తగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అంగీరించకపోవడంతో ఉద్యోగార్థులు ఆందోళనలు చేస్తుండగా, ప్రశాంత్ కిశోర్ వారికి మద్దతుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు