Home Page SliderTelangana

‘ప్రశాంత్ బండిసంజయ్ మనిషే’.. హరీష్‌రావు

బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు రాష్ట్రమంత్రి హరీష్‌రావు. పదో తరగతి పరీక్షలో హిందీ పేపర్ లీక్ చేసిన ప్రధాన నిందితుడు  ప్రశాంత్ బీజేపీ కార్యకర్తేనని రుజువులున్నాయన్నారు. బండి సంజయ్‌తో చాలా క్లోజ్‌గా ఉన్న ప్రశాంత్ ఫొటోలను ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించారు. ఇతర బీజేపీ నాయకులతో,జాతీయపార్టీ నాయకులతో ఉన్న ఫొటోలను కూడా చూపించారు. తెలంగాణా ప్రభుత్వం ఇలాంటి చర్యలను సమర్థించదని, పిల్లల భవిష్యత్తులతో రాజకీయాలు చేస్తే ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. పరీక్ష పూర్తి కాకముందే పేపర్లు వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టేలా చేస్తున్నారని, వారి కార్యకర్తలతో ఇలాంటి పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. తాండూరు పేపర్ లీకేజి వెనుక కూడా బండి సంజయ్ హస్తం ఉందన్నారు. తెలంగాణా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని, తెలంగాణా ప్రజలు బీజేపీని క్షమించరని, నిందితులు ఎవరైనా ఉపేక్షించేది లేదన్నారు.