Horoscope TodaymoviesTrending Today

“పుష్ప2” పై ప్రకాశ్ రాజ్ అభిప్రాయం..?అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు…..!

అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్న జంటగా నటించిన “పుష్ప 2” సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. మొదటి రోజే రూ. 294 కోట్లు రాబట్టి, ఈ మూవీ భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త మైలురాయిని సృష్టించింది. సీనియర్, విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా “పుష్ప 2” సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా, అతను తన అనుభవాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అల్లు అర్జున్ గురించి ప్రసంసిస్తూ, “గంగోత్రి నుండి నీ ప్రయాణాన్ని చూస్తున్నాను. ఒక శిల్పాన్ని చెక్కినట్లు ఉండే, నీ జర్నీ ఎంతో గొప్పది. నిన్ను చూసి గర్వపడుతున్నాను. నువ్వు ఎప్పుడు ఇలాగే నీ నటనతో సరిహద్దులు చెరిపేస్తూ ఉండు” అని చెప్పారు. ప్రకాశ్ రాజ్, అల్లు అర్జున్ నటించిన “గంగోత్రి”, “పరుగు”, “బద్రీనాథ్”, “రేసు గుర్రం”, “సన్నాఫ్ సత్యమూర్తి”, “రుద్రమదేవి” వంటి సినిమాల్లో భాగంగా, ఈ ఇద్దరి కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా సాగింది. అలాగే, “పుష్ప 2” దర్శకుడు సుకుమార్ మరియు నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కూడా తన అభినందనలను తెలిపారు. ప్రకాశ్ రాజ్ చెప్పినట్లు, ఈ సినిమా ప్రభావం దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.