Home Page SliderTelangana

ప్రజావాణికి 687 అర్జీలు వచ్చాయి

హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో  రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా.చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారిణి దివ్య ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. మొత్తం 687 దరఖాస్తులు రాగా, అందులో రెవెన్యూ 225, హౌసింగ్ 59, పౌరసరఫరాల శాఖ 82, హోంశాఖ 47, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి 40, ఇతర శాఖలకు 234 అందినట్లు అధికారులు తెలిపారు.