Home Page SliderTelangana

ప్రజాపాలన 3 రోజుల్లో 40 ,57,592 దరఖాస్తులు – సి.ఎస్ శాంతి కుమారి

హైదరాబాద్, డిసెంబర్ 30 :: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీలకు సంబంధించి నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమం మూడవ రోజు విజయ వంతంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలియ చేశారు. ఈ మూడు రోజుల్లో మొత్తం 40 ,57,592 దారకాస్తులు అందాయని పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని 1991 గ్రామాలు, 1877 మున్సిపల్ వార్డుల్లో నిర్వహించిన ప్రజాపాలనలో నేడు మొత్తం 18,29,107 దరఖాస్తులు స్వీకరించామని అన్నారు. వీటిలో 5 గ్యారెంటీలకు చెందినవి 15 ,88 ,720 దారకాస్తులు కాగా, ఇతర అంశాలకు సంబందించినవి 2,40,387 ఉన్నాయని వివరించారు. నేటి వరకు 3868 గ్రామ పంచాయితీలు, 8697 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు పూర్తయ్యాయని అన్నారు.