డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా ప్రజా భవన్
తెలంగాణాలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత 9 ఏళ్లుగా సీఎం నివాసంగా ఉన్న ప్రజా భవన్ ఇకపై డిప్యూటీ సీఎం అధికారిక నివాసంగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈ భవనాన్ని మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. కాగా ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రగతి భవన్‌గా ఉంది. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ప్రగతి భవన్‌ను జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చారు. మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయం కోసం సరైన కార్యాలయాన్ని అధికారులు వెతుకుతున్నట్లు సమాచారం.