ప్రభాస్-తారక్ క్లియర్ ఇక రామ్ చరణ్ వంతు
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనతో ..తారల్లో నిద్రపోతున్న క్రమశిక్షణ మేల్కొన్నట్లు కనిపిస్తోంది.70ఎంఎం స్క్రీన్స్ మీద ఇగో ప్రదర్శించే హీరోలంతా తెలంగాణ సీఎం రేవంత్ ధాటికి గో గో ఇగో అంటున్నారు.బెన్‌ఫిట్ షోల కోసమో లేదా టికెట్ రేట్ల పెంపు కోసమో ఏదైతేనేం…తెలంగాణలో డ్రగ్స్ ,మాదక ద్రవ్యాల నిర్మూలనకు తమ ప్రభుత్వానికి ఇండస్ట్రీ నుంచి సహకారం కావాలని ,విధిగా స్పెషల్ యాడ్స్ ప్రమోషన్ కావాలని సీఎం రేవంత్ రెడ్డి మొన్న జరిగిన భేటీలో మెలిక పెట్టడంతో ఆ దిశగా తొలుత మేల్కొంది ప్రభాసే.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓ వీడియోని రిలీజ్ చేసి డ్రగ్స్ నిర్మూలనకు భాగస్వాములవుదాం అంటూ పిలుపునిచ్చారు.ఇక రామ్ చరణ్ వంతు మిగిలి ఉంది. సంక్రాంతి బరిలో వెంకటేష్,రామ్ చరణ్, బాలకృష్ణ ఉన్నారు.కానీ వీరిలో ఎవరూ అవేర్ నెస్ ప్రమోషన్ ఇవ్వలేదు.సంక్రాంతి రేసులో ఉన్న హీరోలు సీఎం వ్యాఖ్యలపై వెంటనే స్పందిస్తే భయపడ్డారనుకుంటారని ప్రభాస్ ,తారక్ చేత చెప్పించినట్లు కనిపిస్తుంది.రామ్ చరణ్,బాలయ్య,వెంకటేష్ కూడా యాంటీ డ్రగ్ సొసైటీ కోసం త్వరలో వీడియోలు చేయక తప్పేట్లు లేదు.


 
							 
							