Home Page SliderTelangana

బుజ్జి వాహనంలో ప్రభాస్ పెద్దమ్మ ఫోజులు

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898ఏడి చిత్రాన్ని చూసేందుకు ఆయన పెద్దమ్మ శ్యామలాదేవి ప్రసాద్ ఐమాక్స్‌కు వెళ్లారు. అక్కడ నిలిపి ఉన్న చిత్రంలోని బుజ్జి వాహనాన్ని చూసి ముచ్చటపడ్డారు. దానిలో ఎక్కి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా థియేటర్‌కు వచ్చిన ప్రభాస్ అభిమానులతో మాట్లాడుతూ అభివాదం చేశారు. తన భర్త కృష్ణంరాజు రెబల్ స్టార్ అనిపించుకున్నారని, తన బిడ్డ ప్రభాస్ వెయ్యిమంది రెబల్ స్టార్లతో సమానం అంటూ ముచ్చటగా మెచ్చుకున్నారు. మూవీని హిట్ చేసినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.