ప్రభాస్ కల్కి @రూ.900కోట్లు
టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా “కల్కి”. విడుదలైనప్పటి నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా రూ.1000 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. కాగా ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ.900కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ప్రస్తుతం దేశమంతా కల్కి మేనియా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో దీపికా పదుకునె,అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దుల్కర్ సల్మాన్,దిశ పటాని,మృణాల్ థాకుర్,విజయ దేవరకొండ నటించిన విషయం తెలిసిందే.

