Home Page SliderNational

సెన్సార్ పూర్తి చేసుకున్న ప్రభాస్ “కల్కి” మూవీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “కల్కి”. ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ లభించింది. అయితే ఈ సినిమా రన్‌టైమ్ 2.58 గంటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. కల్కి సినిమాలో విజువల్స్ అదిరిపోయాయని,ఎమోషన్స్ & ఎంటర్‌టైన్మెంట్ సమపాళ్లలో చూపించారని సెన్సార్ టీమ్ అభిప్రాయపడినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. అంతేకాకుండా సినిమా చూసి సెన్సార్ టీమ్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మెచ్చుకున్నట్లు  సినీ వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకుణె, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. “కల్కి” సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శోభన ముఖ్య పాత్రలో కన్పించనున్నారు.