Home Page SliderNational

రూ.500 కోట్లు క్రాస్ చేసిన ప్రభాస్ “కల్కి”

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫిక్షనల్ సినిమా “కల్కి” కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కాగా విడుదలైన 4 రోజుల్లో ఈ సినిమా రూ.500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ తాజాగా ట్వీట్ చేసింది. అయితే ఈ సినిమా శనివారం వరకు రూ.415కోట్లు వసూలు చేసినట్లు మూవీ మేకర్స్ తెలిపారు. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దీపిక పదుకునె కీలక పాత్రలు పోషించారు.