కమర్షియల్ ఆల్బమ్‌తో ప్రభాస్ వస్తున్నారు-థమన్
రెబల్ స్టార్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. జూన్ 27వ తేదీన రిలీజైన కల్కి 2898ఎడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతోంది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరి సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం తర్వాత సలార్ 2, స్పిరిట్, ది రాజా సాబ్, కల్కి2 చిత్రాలు ఉన్నాయి. అయితే ది రాజా సాబ్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు మ్యూజిక్ డైరెక్టర్ థమన్.
డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్‌లో థమన్ మాట్లాడుతూ, ప్రభాస్ చాలా రోజుల తరువాత కమర్షియల్ ఆల్బమ్‌తో వస్తున్నారు. మంచి సాంగ్స్, డ్యాన్స్‌లు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఒక విలేఖరి ఫస్ట్ సింగిల్ గురించి అడగగా, ది రాజా సాబ్ గురించి అడగవద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. థమన్ చేసిన కామెంట్స్‌తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ చిత్రం నుండి రిలీజైన ఫస్ట్ లుక్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

