దసరా ఉత్సవాలకు ప్రభాస్‌కు ఆహ్వానం
బాహుబలి స్టార్ ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్లో గౌరవం దక్కింది. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల చివరిరోజైన విజయదశమి రోజున రావణ దహనం కార్యక్రమాన్ని జరుపుతారు. ఈ కార్యక్రామానికి తెలుగు రెబల్ స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందినట్లు సమాచారం. ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఆయన శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. దీనితో ప్రభాస్‌ను అతిథిగా పిలిచారని తెలుస్తోంది. బాహుబలి -1 బాహుబలి -2 సినిమాలు రెండూ కూడా హిందీలో ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.