రాజేంద్రప్రసాద్ ఇంటికి ప్రభాస్
రెబల్ స్టార్ ప్రభాస్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ను కలిశారు. కూకట్ పల్లిలోని ఇందువిల్లాస్‌లో గల రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఆయన కుమార్తె గాయత్రి మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ప్రభాస్ ఆయనకు సంతాపం తెలియజేశారు. చిన్న వయసులోనే ఆమె గుండెపోటుతో మరణించడం చాలా విషాదకరం అన్నారు. అనంతరం ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు.