Home Page SliderNational

పోలీస్ పాత్రలో ప్రభాస్… యానిమల్ డైరక్టర్ అప్‌డేట్

తొలిసారిగా స్టార్ హీరో ప్రభాస్ పోలీస్ అధికారి పాత్రలో నటించబతున్నారు. యానిమల్ డైరక్టర్ సందీప్ వంగా ఈ చిత్రంపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. సంచలన దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ అనే చిత్రంలో ప్రభాస్ పాత్రపై నిర్మాత ప్రణయ్ రెడ్డి ఈ విషయం తెలియజేశారు. యాంగ్రీ యంగ్‌మ్యాన్‌గా, డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ నటించబోతున్నారని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. దీనితో చాలాకాలంగా అభిమానులు పోలీస్ పాత్రలో తమ హీరోని చూడాలనే కోరిక తీరనుందని సంబరపడుతున్నారు. సలార్ సినిమా సక్సెస్‌తో ప్రభాస్, యానిమల్ సక్సెస్‌తో సందీప్ వంగా ఇప్పటికే ఖుషీగా ఉన్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే స్పిరిట్ చిత్రం కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది మొదలవుతుందని నిర్మాత తెలిపారు.