బ్రో సినిమా వివాదంపై స్పందించిన పవర్ స్టార్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు బ్రో సినిమా వివాదంపై స్పందించారు. కాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన తాజాగా బ్రో సినిమాపై నెలకొన్న వివాదంపై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..రాజకీయాల్లోకి సినిమాను తీసుకురాకండి అన్నారు. రాజకీయాలను నడిపేందుకు నా ఇంధనం సినిమాలే అని ఆయన స్పష్టం చేశారు. అయితే నా సినిమాల గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్న సమస్యల గురించి నేను ప్రశ్నిస్తున్నాను.కాబట్టే వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వాళ్లు అలా మాట్లాడతారని పవన్ తెలిపారు. అయితే నేనే ఆ సినిమా చేసి వదిలేశాను.మరి మీరెందుకు మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాగా జనసేన పార్టీ అధికార ప్రతినిధులు కూడా సినిమాలపై మాట్లాడొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు.