Home Page SliderNational

యూపీలో అగ్నిప్రమాదంతో ఢిల్లీలో కరెంటు కష్టాలు

ఇప్పటికే మండే ఎండలతో, నీటి కరువుతో విలవిల్లాడుతున్న ఢిల్లీ ప్రజలపై కరెంటు కష్టాలు కూడా వచ్చి పడ్డాయి. యూపీలోని మండోలా పవర్ గ్రిడ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. దీనితో అక్కడ నుండి ఢిల్లీకి సరఫరా అయ్యే 1500 మెగావాట్ల కరెంటు రావడం లేదు. ఈ విషయాన్ని ఢిల్లీ మంత్రి ఆతిశీ వివరించారు. మంగళవారం మధ్యాహ్నం నుండి కరెంటు కోతలు డిల్లీ వ్యాప్తంగా మొదలయ్యాయి. దేశంలో విద్యుత్ సరఫరా కేంద్రప్రభుత్వ పర్యవేక్షణలో ఉంది. జాతీయ స్థాయిలో గ్రిడ్ విఫలం కావడం ఆందోళనకరమని జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కేంద్రాన్ని విమర్శించారు ఆతిశీ. కొత్త విద్యుత్ శాఖ మంత్రి అపాయింట్‌ కోరుతానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వంపై హరియాణా ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అందుకే నీటి విడుదలను తగ్గించిందని ఆతిశీ ఆరోపించారు. దినితో సుప్రీంకోర్టు మిగులు నీటిని సరఫరా చేయాలని హరియాణాను ఆదేశించింది. మరోపక్క ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య కూడా తగాదాలు, విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.