ఏపీలో చెత్తతో విద్యుదుత్పత్తి ప్లాంట్స్..మంత్రి
ఏపీ మంత్రి నారాయణ చెత్త నుండి విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దేశం మొత్తంలో ఇలాంటి ప్లాంట్లు 3 మాత్రమే ఉంటే, వాటిలో 2 ఆంధ్రప్రదేశ్‌లో గతంలో టీడీపీ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 85 వేల టన్నుల చెత్తను వదిలేసి వెళ్లిందని, చెత్తపై పన్ను వేయడమే తప్ప దానిని ఎలా వినియోగించాలో వారికి తెలియదన్నారు. ఇప్పుడు కాకినాడలోనూ, నెల్లూరులోనూ ఈ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అలాగే రాయలసీమలో కూడా త్వరలోనే ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.