పోర్ట్ బ్లెయిర్ పేరు మార్పు..అమిత్‌షా
అండమాన్ నికోబార్ ఐల్యాండ్స్ రాజధాని పోర్ట్ బ్లెయిర్ నగరం పేరును మార్చుతున్నట్లు కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఇకపై ఈ నగరం పేరును శ్రీ విజయపురం అని మార్చినట్లుగా తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్రమోదీ విజన్‌ను అనుసరించి, బ్రిటిష్ పాలనను గుర్తు చేసే నగరాల పేర్లను మార్చుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులు మన దేశ స్వాతంత్య్ర పోరాటంలో, చరిత్రలో చాలా ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలని ఆయన పేర్కొన్నారు.

