Home Page SliderTrending Today

MPని పెళ్లి చేసుకోబోతున్న ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్

ప్రముఖ బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా ,ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా డేటింగ్‌లో ఉన్నారని గత కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. దీంతో వీరిద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కుతున్నారనే పుకార్లు దేశమంతా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అటు పరిణీతి చోప్రా కానీ,ఇటు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కానీ స్పందించలేదు. ఈ విషయంపై పరిణీతి చోప్రాను తాజాగా ఓ విలేకరి ఎయిర్‌పోర్ట్ నుంచి వస్తున్నప్పుడు  ప్రశ్నించగా ఆమె నవ్వుతూ..వెళ్లిపోయారు. దీంతో అందరూ ఇది నిజమేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై సింగర్ హార్డీ సంధూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా ఆమె వీరు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని తెలిపారు. ఇప్పటికే పరిణీతికి కాల్ చేసి కంగ్రాట్స్ కూడా చెప్పానని ఆమె వెల్లడించారు. వీరిద్దరు వివాహం చేసుకుంటున్నందుకు హ్యాపీగా ఉందన్నారు. పరిణీతికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానన్నారు.అంతేకాకుండా ఇటీవల ఆప్ ఎంపీ అరోరా కూడా వీరికి అభినందనలు తెలిపారు. దీంతో వీరి పెళ్లి వార్త నిజమేననే వార్తలకు బలం చేకూరింది. మరి ఈ విషయాన్ని  పరిణీతి ,రాఘవ్ చద్దా ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారో వేచి చూడాల్సివుంది.