ఓటు హక్కు వినియోగించుకున్న పొన్నం దంపతులు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి పొన్నం దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాకపోవడానికి కిషన్ రెడ్డే కారణం మంత్రి పొన్నం ఆరోపించారు.

