కాంగ్రెస్‌తో ‘చేయి’కలిపిన పొంగులేటి
బీఆర్‌ఎస్ సస్పెండెడ్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానించి ‘చేయి’ కలిపింది తెలంగాణా కాంగ్రెస్. తన వర్గానికి 10 టిక్కెట్లు ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేసినట్లు సమాచారం. అయతే పార్టీలో చేరకముందే డిమాండ్ చేయడంపై సీనియర్ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. భట్టివిక్రమార్క, రేణుకాచౌదరి తదితరులు పార్టీలో చేరిన తర్వాత టిక్కెట్ల గురించి మాట్లాడవచ్చన్నారు. గతంలో కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పార్టీ నుండి సస్పెండ్ అయిన విషయం మనకు తెలిసిందే. తనకు, తన వర్గానికి సీట్లు ఇవ్వలేదని, పార్టీకి విధేయంగా ఉంటున్నా తనను గుర్తించలేదని ఈ మధ్య జరిగిన ఆత్మీయసభలో పొంగులేటి వాపోయారు. దీనితో సీరియస్ అయిన కేసీఆర్ వారిద్దరినీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వీరిద్దరూ బీజేపీలోకి వెళ్తారా? కాంగ్రెస్‌లోకి వెళ్తున్నారా? అనే చర్చలు కొన్నిరోజులుగా జరుగుతున్నాయి. అయితే పొంగులేటి కాంగ్రెస్‌పార్టీలో చేరడం ఖాయమయ్యిందనే రాజకీయవర్గాలు భావిస్తున్నారు.

