కాలుష్యం ఎఫెక్ట్ ..కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు
దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం కోరలు చాస్తోంది. దీనితో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దీనివల్ల రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పాఠశాలలకు ఆన్‌లైన్ క్లాసులు, కోర్టులలో లాయర్లు వర్చువల్ మోడ్‌లో పాల్గొని వాదనలు వినిపించాలని సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా పేర్కొన్నారు. అయితే ఢిల్లీలో అనేక ప్రాంతాలలో ఏఐక్యూ 500 మార్క్ దాటడంతో వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యాన్ని కొంతైనా తగ్గించేందుకు కృత్రిమ వర్షాన్ని కురిపించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు.