NewsTelangana

మునుగోడులో జోరుగా పోలింగ్, 9 గంటలకు 11.2 శాతం పోలింగ్

ప్రతిష్టాత్మక మునుగోడు ఉప ఎన్నికలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 11.2 శాతం ఓటింగ్ నమోదైంది. ఓటింగ్‌లో పాల్గొనేందుకు మునుగోడు ప్రజలు బారులు తీరుతున్నారు. 298 కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని.. సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని ఈసీ అధికారులు పరిశీలిస్తున్నారు. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద స్థానికేతరులు ఉన్నారని ఆందోళన సాగుతోంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొంపల్లిలో ఈవీఎం మొరాయించింది. ఈవీఎం మార్చి అధికారులు తిరిగి ఓటింగ్ నిర్వహిస్తున్నారు.