కర్నాటకలో మొదలైన పోలింగ్
కర్నాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు సభ్యులను ఎన్నుకునేందుకు ఈరోజు ఓటింగ్ ప్రారంభమైంది. ప్రభుత్వ వ్యతిరేకత అధికారాన్ని కట్టబెడుతుందని కాంగ్రెస్ పార్టీ విశ్వాసంగా ఉంటే, మరోసారి అధికార పగ్గాలు అందుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. 61 సీట్లలో మెజార్టీ వర్గంగా ఉన్న వక్కిలిగలు… తన అదృష్టాన్ని మార్చుతారని జేడీఎస్ అధినేత కుమారస్వామి విశ్వాసంగా ఉన్నారు. శనివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.

హై-వోల్టేజ్ ప్రచారం తర్వాత, కర్ణాటకలో ఓట్ల పోరుకు రంగం సిద్ధమైంది. కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీ(ఎస్) అవసరం కాంగ్రెస్, బీజేపీకి ఉంటుందని ఆ పార్టీ నమ్మకంగా ఉంది. కర్నాటక అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 113 సీట్లు.