మహారాష్ట్రలో ఇండియా భాగస్వామ్యపక్షాల మధ్య కుదిరిన సయోధ్య
రాష్ట్రంలోని 48 సీట్లలో 39 సీట్లకు సంబంధించి భాగస్వామ్యపక్షాల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. లోక్ సభ ఎన్నికల కోసం సీట్ల పంపకాల ఒప్పందాలను ఖరారు చేసుకోవడంలో కాంగ్రెస్ మరో అడుగు ముందుకు వేసింది. రాహుల్ గాంధీ, శివసేన (UBT) బాస్ ఉద్ధవ్ థాకరే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శరద్ పవార్ ముగ్గురు ఒక అవగాహనకు వచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని 80 సీట్లలో 17 స్థానాలకు అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో, ఢిల్లీలోని ఏడింటిలో మూడింటికి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీతో ఆ పార్టీ ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లో తమకు కనీసం ఐదు సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే.. మూడో సీటు కూడా బూతద్దం వేసి చూసినా తమకు కన్పించడం లేదంటూ టీఎంసీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.

మహారాష్ట్రలో, సేన (UBT), కాంగ్రెస్ రెండూ కోరుకునే ముంబైలోని రెండు – సౌత్ సెంట్రల్, నార్త్ వెస్ట్‌తో సహా ఎనిమిది స్థానాలకు పైగా మిత్రపక్షాల మధ్య విభేదాలన్నాయి. ఐదు సీట్లు కావాలన్న వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత ప్రకాష్ అంబేద్కర్ కోరుతున్నారు. 2019 ఎన్నికల్లో అంబేద్కర్ పార్టీ 47 స్థానాల్లో పోటీ చేసినా, ఒక్కటి కూడా గెలవలేకపోయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 236 స్థానాల్లో పోటీ చేసి తన ఖాతా తెరవలేదు. శివసేన 2019లో 23 లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి, ముంబై సౌత్ సెంట్రల్ మరియు నార్త్ వెస్ట్‌తో సహా 18 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేసి చంద్రాపూర్‌లో మాత్రమే గెలిచింది. శరద్ పవార్ NCP 19 స్థానాల నుండి పోటీ చేసి నాలుగు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 25 స్థానాలకు గాను బీజేపీ 23 స్థానాల్లో విజయం సాధించింది. అశోక్ చవాన్ పార్టీ వీడి బీజేపీలో చేరడం, మిలిందేవరా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సేనలో చేరడంతో కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటోంది.