Home Page SliderTelangana

తెలంగాణాలో వేడెక్కిన రాజకీయాలు

తెలంగాణాలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణాలోని అధికార,ప్రతిపక్ష పార్టీలు అధికార కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా కాంగ్రెస్ పార్టీ మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం.బీఆర్ఎస్ పార్టీ మూడోసారి సీఎం పదవే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించింది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే మంత్రులు కేటీఆర్,హరీష్‌రావు నియోజక వర్గాల్లో  విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నారు. మరోవైపు బీజేపీ పార్టీ కూడా తెలంగాణాలో భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు రూపొందిస్తుంది. కాగా రేపు బీజేపీ ముఖ్యనేత అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణాలో పర్యటించనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణాలో బస్ యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.