Home Page SliderNational

రాజకీయ నాయకులు ఇకపై ఈ పదాలు వాడొద్దు:ఈసీ

కేంద్రం ఎన్నికల సంఘం దేశంలోని రాజకీయ నాయకులకు కీలక ప్రకటన చేసింది. కాగా రాజకీయ నాయకులు ఇకపై తమ ప్రసంగాల్లో దివ్యాంగుల వైకల్యాన్ని తెలిపే పదాలను వాడొద్దని కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. దేశంలోని రాజకీయ నాయకులు,పార్టీలు తమ ఉపన్యాసాల్లో దివ్యాంగులకు న్యాయం,గౌరవం కల్పించాలని తెలిపింది. ఈ మేరకు ఇకపై ప్రసంగాల్లో మూగ,పాగల్,అంధ,గుడ్డి,చెవిటి,కుంటి,సిర్ఫిరా వంటి పదాలను వాడుకూడదని పేర్కొంది. అంతేకాకుండా తాము దివ్యాంగులను గౌరవిస్తున్నట్లు అన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వెబ్‌సైట్‌లో పేర్కొనాలని ఆదేశించింది. దీని ప్రకారం ఇకపై రాజకీయ నాయకులు ఎవరైనా ఈ పదాలను వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది.