NationalNews

పళనికి లైన్ క్లియర్.. పన్నీర్ కు చుక్కెదురు

ఆట రసవత్తరంగా మారింది. పళనిస్వామి-పన్నీర్ సెల్వం మధ్య వైరం తారాస్ధాయికి చేరింది. పళని స్వామిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్న దగ్గర నుండి ఇరు వర్గాల మధ్య గొడవలు తీవ్రం అయ్యాయి. ఇద్దరూ కోర్టు మెట్లెక్కారు. పిటీషన్ల మీద పిటీషన్లను దాఖలు చేశారు. పళని స్వామి ఎన్నికపై పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటీషన్ ను న్యాయమూర్తి జయచంద్రన్ విచారించి స్టే విధించారు. దీనిపై హైకోర్టుకు వెళ్ళిన పన్నీర్ సెల్వంకు చుక్కెదురైంది. పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగానే సర్వ సభ్య సమావేశం జరిగిందని కోర్టు పేర్కొంది. దీంతో పళమి స్వామికి ఊరట లభించినట్లు అయ్యింది. తదుపరి కార్యాచరణపై పన్నీర్ సెల్వం దృష్టి పెట్టారు.