Home Page SliderNews AlertTelanganatelangana,

అల్లు అర్జున్‌కు పోలీసుల వార్నింగ్

హీరో అల్లు అర్జున్‌కు పోలీసులు తమకు సమాచారం ఇవ్వకుండా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లకూడదంటూ వార్నింగ్ ఇచ్చారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు ఎప్పుడు రావాలనుకున్నా తమకు సమాచారం ఇవ్వాలని రాంగోపాల్ పేట్ పోలీసులు  నోటీసులు ఇచ్చారు. బెయిల్ షరతులు తప్పకుండా పాటించాలని సూచించారు.  అల్లు అర్జున్ ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో అక్కడ ప్రజలు గుంపులుగా చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.