సినీ నటుడి ఇంటికి పోలీసులు..
సినీ నటుడు మోహన్ బాబు ఇంటికి పహాడీ షరీఫ్ పోలీసులు వెళ్లారు. జల్ పల్లి లోని ఫాంహౌస్ లో ఆయన లేక పోవడంతో ఫిలింనగర్ నివాసానికి వచ్చారు. ఆయన ఇక్కడ కూడా అందుబాటులో లేరు. మోహన్ బాబు ఇదే సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. జర్నలిస్టుపై దాడి కేసులో పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మోహన్ బాబు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. మోహన్‌బాబుకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. అయితే దీనిపై విచారించిన కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టేసింది. జర్నలిస్టుపై ఆయన ఇంటివద్ద కోపంతో దాడి చేసిన ఘటనపై మీడియా కేసు నమోదు చేసింది. ఈ కేసులో హత్నాయత్నం కేసు కావడంతో ముందస్తు బెయిల్‌కు కోర్టు నిరాకరించింది. దీనితో ఆయనను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
BREAKING NEWS: అల్లు అర్జున్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీ..