Home Page SliderInternationalNational

అమృత్ పాల్ సింగ్ భార్యను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకున్న పోలీసులు

అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను అమృత్‌సర్ విమానాశ్రయంలో పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లండన్ వెళ్లేందుకు విమానం ఎక్కే సమయంలో ఆమెను పోలీసులు అడ్డగించారు. ఐతే తాము అమృత్‌పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను అదుపులోకి తీసుకోలేదని, ఇమ్మిగ్రేషన్ విభాగం ప్రశ్నిస్తోందని పంజాబ్ పోలీసులు తెలిపారు. అమృత్‌పాల్ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు. తన వివాహం రివర్స్ మైగ్రేషన్‌కు ఉదాహరణ అంటూ చెప్పుకొచ్చాడు. భార్యతో కలిసి తాను పంజాబ్‌లో నివసిస్తానని ప్రకటించాడు. ఖలిస్తానీ-పాకిస్థాన్ ఏజెంట్‌గా అభివర్ణించే అమృత్‌పాల్ సింగ్, కొన్నాళ్లుగా సాయుధ మద్దతుదారులతో హల్‌చల్ చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. అమృత్ పాల్ సింగ్ తనకు తానుగా, ఖలిస్తానీ వేర్పాటువాది, టెర్రరిస్ట్ జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే అనుచరుడిగా పేర్కొన్నాడు. అమృత్ పాల్ సింగ్‌ను ఆయన మద్దతుదారులు “భింద్రన్‌వాలే 2.0” అని పిలుస్తారు. సాయుధ బలగాలు ధరించి రోడ్లపై తిరుగుతున్న “వారిస్ పంజాబ్ దే” సభ్యులపై పోలీసులు గత నెలలో పెద్ద ఎత్తున అణిచివేతను ప్రారంభించారు. మార్చి 18న జలంధర్ జిల్లాలో వాహనాలు మార్చడం, రూపురేఖలు మార్చడం ద్వారా పోలీసుల చిక్కకుండా అమృత్ పాల్ సింగ్ తప్పించుకున్నాడు.