తిరుపతి రెడ్డిని ప్రశ్నించిన జేఏసీ నాయకులను అడ్డుకున్న పోలీసులు
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని ప్రశ్నించేందుకు వెళ్లిన కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ కమిటీ జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
కొడంగల్ నియోజకవర్గ కేంద్రానికి కేటాయించిన మెడికల్, వెటర్నరీ, ఇంటిగ్రేటెడ్, నర్సింగ్, పారామెడికల్ కళాశాలలను ఇతర మండలానికి తరలించవద్దని జేఏసీ సభ్యులు తిరుపతి రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
కళాశాలల తరలింపు అంశంపై తన స్పష్టమైన వైఖరి ఏమిటో తెలపాలని వారు తిరుపతి రెడ్డిని అడిగారు. అయితే తిరుపతి రెడ్డి స్పందించకుండా వెళ్లిపోవడంతో జేఏసీ నాయకులు అక్కడే నిరసన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు జేఏసీ నాయకులను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

