Home Page SliderTelangana

12 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

హైదరాబాద్-చైతన్యపురి పరిధిలో ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు గుంపు రూపంలో ఉన్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడ కొంత మంది చిన్నారులను దాచుకొని ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే దగ్గరకు వెళ్లి చూడగా.. 12 మంది చిన్నారులు కనిపించారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలు, ఐదుగురు అబ్బాయిలు ఒక అబ్బాయి మినహా అంతా సంవత్సరంలోపు చిన్నారులు ఉన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా.. నిందితులు ఈ చిన్నారులను వేరే చోటికి తరలించడానికి సిద్ధపడినట్లు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా చిన్నారులను చైతన్యపురి పోలీసులు రక్షించారు. అనంతరం చిన్నారులను మధురానగర్‌లోని శిశువిహార్‌కు తరలించారు. అయితే.. ఆ 12 మంది చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ కోసం చర్యలు ప్రారంభించారు. చిన్నారుల తల్లిదండ్రులను వెతికేందుకు.. అనేక ప్రాంతాల్లో పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.