Home Page Sliderhome page sliderNational

రేవ్ పార్టీపై పోలీసుల దాడి.. 31 మంది అరెస్ట్

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు దేవనహళ్లి సమీపంలోని కన్నమంగళ గేట్ వద్ద ఓ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహించారు. అయితే.. రేవ్ పార్టీపై ఉత్తర తూర్పు డివిజన్ పోలీసులు దాడి చేసి 31 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు. రేవ్ పార్టీలో కొకైన్, హషీష్, హైడ్రో గంజాయి వంటి మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ ఉద్యోగులైన నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదైంది.