బీదర్ దొంగల కోసం పోలీసుల వేట
బీదర్ దొంగల కోసం పోలీసులు వేట కొనసాగుతోంది. 8 ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులను చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు చెందిన వారిగా గుర్తించారు. వారు హైదరాబాద్ నుంచి అడ్డదారుల్లో రాయ్ పూర్ కు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. నిన్న బీదర్ భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి ఏటీఎం డబ్బులు దొంగిలించిన నిందితులు సాయంత్రం హైదరాబాద్ కు వచ్చారు. అఫ్టల్ గంజ్ లో ట్రావెల్స్ సిబ్బంది పై కాల్పులు జరిపారు. అనంతరం ట్యాంక్ బండ్ వరకు ఆటోలో వెళ్లినట్లు పోలిసులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడి నుంచి ఎటువైపు వెళ్లారని పోలీసుల ప్రత్యేక టీం ముమ్మరంగా గాలిస్తున్నాయి.