Andhra PradeshNews

తెనాలిలో పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు

అమరావతి రైతులు ప్రారంభించిన మహపాదయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలి దగ్గర ఈ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తెనాలి దగ్గర ఐతారం వైపుగా రైతుల పాదయాత్ర కొనసాగాల్సివుంది. అయితే ఎమ్మేల్యే ఇల్లు ఉన్న కారణంగా  పోలీసులు అటువైపు పాదయాత్ర చేయకుండా రైతులను అడ్డుకున్నారు. అనంతరం పోలీసులు పాదయాత్ర చేస్తున్న రైతులను మరో మార్గంలో  కూడా దారీ మళ్ళించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ పాదయాత్రలో పాల్గొన్న జేఏసీ నేతలు ప్రతిఘటించారు. ఈ మేరకు పోలీసులు,జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో జేఏసీ నేతలు పై అధికారులతో మాట్లాడారు. అంతలోనే పాదయాత్రలో పాల్గొన్న రైతులు బారీకేడ్లు తోసుకుంటూ..ముందుకెళ్లారు. ఈ మేరకు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.