Andhra PradeshNews

అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా

నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.26.09.2022వ తేదీ నుండి 05.10.2022వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని అనవాయితీగా వస్తున్న సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా సతీ సమేతంగా అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు మరియు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో అనవాయితీ ప్రకారం రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అమ్మవారికి సారెను తీసుకుని దుర్గగుడికి వెళ్ళగా, దుర్గగుడి ఈ.ఓ. భ్రమరాంబ, దుర్గగుడి అధికారులు నగర పోలీస్ కమీషనర్ దంపతులకు సాదరంగా ఆహ్వానం పలికారు. వేద పండితుల నడుమ పూజలు జరిపి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ విశాల్ గున్ని కూడా పాల్గొన్నారు.