వాషింగ్ మెషిన్‌లో రూ.1.30 కోట్లు.. పట్టుకున్న పోలీసులు
నగరంలోని ఎన్ఎడీ జంక్షన్ వద్ద భారీగా హవాలా నగదును విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు పట్టుకున్నారు.
విశాఖ: నగరంలోని ఎన్ఎడీ జంక్షన్ వద్ద భారీగా హవాలా నగదును విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు పట్టుకున్నారు. వాషింగ్ మెషిన్‌లో కరెన్సీ నోట్ల కట్టలను ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. రూ.1.30 కోట్ల నగదు.. 30 మొబైల్ ఫోన్లను పోలీసులు పట్టుకున్నారు. నగదు తరలింపుపై సరైన ఆధారాలు చూపించకపోవడంతో సీఆర్‌పీసీ 41, 102 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నగదును విజయవాడకు తరలిస్తున్నట్లు గుర్తించారు.