‘పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటున్నారు’..జగన్
ఉమ్మడి కర్నూలు జిల్లా వైసీపీ నేతలతో అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. పోలీసులను వాచ్‌మెన్ల కంటే ఘోరంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ “రాష్ట్రంలోని అన్ని వర్గాల వారినీ చంద్రబాబు మోసం చేశారు. రెండు బడ్జెట్‌లు పెట్టినా హామీలు అమలు చేయలేదు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు తిరోగమనంలో ఉన్నాయి. హామీల అమలు, పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారు. విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్, వసతి దీవెన అందడం లేదు. దీనివల్ల టీడీపీ నేతలు ప్రజల దగ్గరకు వెళ్తే వారిని నిలదీస్తున్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోంది”. అని వ్యాఖ్యానించారు.


 
							 
							