Andhra PradeshNews

పోలవరం నో ఎంట్రీ… రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

పోలవరం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరం సందర్శనకు వెళ్లారు. ఆయన పోలవరం వెళుతున్న సమాచారం తెలుసుకొని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలవరం డ్యాం సైట్‌కు వెళ్లే రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. తనతోపాటు, మరో ఐదుగురు నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులను చంద్రబాబు కోరారు. అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించారు. విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబుతోపాటు దేవినేని ఉమా, రామానాయుడు, బుచ్చయ్యచౌదరి తదితరులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పోలవరం ఎందుకు వెళ్లకూడదో లిఖిత పూర్వకంగా రాసివ్వాలని రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.