Home Page SliderTelangana

ఈటలపై కేసీఆర్ పత్రికలో విషం

హుజూరాబాద్ సభకు జనం లేరంటూ అసత్య కథనాలు
నాటి కుట్రలను మళ్లీ తెరపైకి తెస్తున్న కేసీఆర్ అండ్ కో
గిట్టనోళ్లపై బురదజల్లడం.. అసత్యాలు ప్రచారం చేయడం…
మరోసారి ఈటలపై బురదజల్లుతోన్న రోత పత్రిక

కేసీఆర్ నిజస్వరూపం మరోసారి బయట పెట్టుకుంటున్నారు. గిట్టని వాళ్ళపై విషం చిమ్మడం అలవాటుగా పెట్టుకున్న దొర మరోసారి ఈటలను చిన్నగా చూపించాలని కుతంత్రాలుపన్నుతున్నారు. తనతో ఉంటే ఓకే. లేదంటే బట్టకాల్చి మీదేయడం అలవాటుగా చేసుకున్న పైశాచకాన్ని మరోసారి ప్రదర్శిస్తున్నాడు. కేసీఆర్ కుట్రలు చేసి, కుతంత్రాలు చేసి, రాజకీయాల నుంచి ఈటలను ఫేడౌట్ చేయాలని కక్షగడితే అక్కున చేర్చుకొంది హుజూరాబాద్. దొర పెత్తనమేంటని గర్జించింది. ఇంకెక్కడైనా నీ ఆటలు.. హుజూరాబాద్ గడ్డపై సాగవని తేల్చి చెప్పింది. హుజూరాబాద్ జనం కేసీఆర్ అండ్ కోకు కర్రుగాల్చి వాతపెట్టారు. కానీ వారి బుద్ధిలో మాత్రం ఇసుమంత కూడా మార్పు రాలే.

గిట్టనివాళ్ల రాజకీయాల్లో ఉండరాదని, వారి అంతం చూడాలనే బరితెగింపు ఈటల విషయంలో మరోసారి రుజవవుతోంది. మరోసారి కేసీఆర్ పత్రిక ఈటల రాజేందర్‌పై పడింది. బీజేపీ జన గర్జన సభకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ రావడంతో, పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. జమ్మికుంట సభకు జనం ఎలా వచ్చారో ఓసారి చూస్తే అర్థమవుతుంది. అందుకోసమే ఈ చిత్రాలు ఓసారి చూడాలి. హుజురాబాద్‌లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన సభలో జనం లేరంటూ నమస్తే కట్టుకథ రాసింది. జనమే లేరంటూ ఆ పత్రిక ఇష్టానుసారంగా కథనాలు వండివార్చింది. అయితే వాస్తవం వేరు. ప్రధాన దినపత్రికలను చూస్తే నిజమేంటో తెలుతుంది.

వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ గడ్డపై ఈటల కాలు పెట్టబోతుండటంతో ఇప్పుడు కేసీఆర్ వన్నులో వణుకుపుడుతోంది. హుజూరాబాద్ ఓటర్లు నీకే అండగా ఉన్నామంటూ ఈటలకు జై కొడుతున్నారు. అదే సమయంలో గజ్వేల్‌లోనూ ఈటలకు జై కొడతామంటూ బడుగు, బలహీనవర్గాలు రారమ్మంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పుడు కంగారుపడుతున్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల ఇప్పుడు చెప్పలే.. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన వెంటనే చెప్పిండి. కానీ ఇప్పుడు ఈటలను బద్నాం చేసేందుకు నమస్తే తెలంగాణ కట్టుకథలతో, నియోజకవర్గంలో ప్రజలను అవమానిస్తోంది. హుజురాబాద్‌లో ఈటలను దెబ్బ కొట్టాలన్న వ్యూహమా అన్నది తేలాలి.

కేసీఆర్ మీ ఆటలు ఇకపై సాగవు. తెలంగాణ ప్రజలకు నీ బండారం మొత్తం తెలిసిపోయింది. వచ్చే ఎన్నికల్లో నువ్వు ఏం చేయాలనుకున్నా, ఏం చేసుకున్నా.. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నీ మేనిఫెస్టో, నీ బాడాయి మాటలు, కల్లబొల్లి కబుర్లు వింటానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. వచ్చే ఎన్నికల్లో అటు గజ్వేల్ లోను, ఇటు కామారెడ్డిలో రెండు చోట్ల ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. నువ్వు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగా మారిన సంగతి ఓటర్లకు తెలియదనుకుంటున్నావా..? చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్నట్టుగా ఇన్నాళ్లూ తెలంగాణ పేరుతో ప్రజలను వంచించావు.. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నీ బండారం అంతా బయటపడింది.