NewsTelangana

సూపర్‌ స్టార్ ఇంటి దగ్గర జేబు దొంగలు

తమ అభిమాన హీరో సూపర్‌ స్టార్‌ కృష్ణను కడసారి చూద్దాం అనుకుని వచ్చిన అభిమానుల్లో కొందరు దొంగల బారిన పడ్డారు. తమ డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమన్నారు. కొందరు జేబు దొంగలను అనుమానించి నిలదీశారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డబ్బులు, పర్సులు, మొబైల్‌ ఫోన్లు పోగొట్టుకున్న వారు ఆందోళనకు గురి అయ్యారు.  విలక్షణ నటుడు కృష్ణ కడసారి చూపు కోసం సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఇదే అదనుగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు.