షర్మిలకు ప్రధాని ఫోన్… ఇటీవల జరిగిన ఘటనలపై చర్చ
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పలుకరించారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. హైదరాబాద్‌లో షర్మిల అరెస్టుతో పాటు ఇటీవల తెలంగాణలో జరిగిన ఘటనల గురించి మోదీ, ఆమెను అడిగి తెలుసుకున్నారు. తాజా ఘటనలపై షర్మిలకు ప్రధాని సానుభూతి తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు మోదీ సంభాషణ జరిగింది. తనకు ఫోన్ చేసినందుకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంతో మంది తన అరెస్ట్ పట్ల స్పందించారని, మోదీ కూడా ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారని షర్మిల తెలిపారు. ఇటీవల తన వాహనాన్ని దగ్ఢం చేశారని షర్మిల ప్రగతిభవన్‌కు వెళుతుండగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కారులో ఉండగానే తీసుకెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఫోన్ చేయడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వైఎస్ షర్మిల తెలిపారు.