Home Page SliderNational

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ వార్నింగ్

పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగించేవారిని ప్రజలు గుర్తుంచుకోరన్నారు ప్రధాని మోదీ. బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలకు వార్నింగ్ ఇచ్చారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దని కోరారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కే అలవాటున్న ఎంపీలు తమ పార్లమెంటు సభ్యులుగా ఉన్న కాలంలో ఏం చేశారో ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నానన్నారు. “పార్లమెంటుకు సానుకూలంగా సహకరించిన వారిని అందరూ గుర్తుంచుకుంటారు. కానీ అంతరాయం కలిగించిన సభ్యులను గుర్తుంచుకోలేరు. ఈ బడ్జెట్ సమావేశాలు పశ్చాత్తాపానికి, సానుకూల దృక్పధానికి ఒక అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని నేను ఎంపీలందరినీ కోరుతున్నాను. వారి అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్నారని ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 9న ముగియనున్న బడ్జెట్ సెషన్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీజేపీ పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని ప్రధాని మోదీ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించే సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రధాని మోదీ తెలిపారు.