Andhra PradeshHome Page Slider

తెలంగాణలో మోదీ పర్యటన వాయిదా

Share with

జనవరి 19న తెలంగాణ రాజధానికి రావాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ వాయిదా పడింది. 2,400 కోట్ల విలువైన వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. రూ.700 కోట్లతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునీకరణ, రూ.1,231 కోట్లతో సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మధ్య రైల్వే లైన్‌ డబ్లింగ్‌, రూ.521 కోట్లతో కాజీపేట రైల్వే కోచ్‌ వర్క్‌షాప్‌ పనులు వివిధ అభివృద్ధి పనులకు మోదీ శ్రీకారం చుట్టాల్సి ఉంది. ప్రధాని బిజీ షెడ్యూల్ కారణంగానే పర్యటన వాయిదా పడిందని, ప్రధాని హైదరాబాద్ పర్యటన గురించి మరింత సమాచారం తర్వాత నిర్ధారిస్తామని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.

వాస్తవానికి మోదీ టూర్ కోసం తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ పర్యటనలో భాగంగా అధికారిక కార్యక్రమాలతో పాటు పలు రాజకీయ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేశారు. తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ మూడు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. 19న సికింద్రాబాద్‌లో వందేభారత్ రైలును ప్రారంభించి, సికింద్రాబాద్-విజయవాడ మధ్య రైల్వే ఆధునీకరణ పనులకు శంకుస్థాపన, కాజీపేటలోని కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు పరేడ్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన తేదీలను కొద్దిరోజుల తర్వాత ప్రకటిస్తారు.