Andhra PradeshPoliticsviral

అమరావతిపై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్‌

అమరావతి పునఃప్రారంభంపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.  ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉంది. అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి పట్ల ఉన్న దార్శనికత మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నాను”. అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.