ప్రధాని మోడీ 26న నగరానికి రానున్నారు..
ఓటర్లను ఒక్కటే అడగదలుచుకున్నారు, ఈ దేశం ముందుకెళ్లాలంటే ముందుగా తమ ఓటును బీజేపీ గుర్తు అయిన కమలం పువ్వు గుర్తుపై వేసి ఒక్క ఛాన్స్ ఇప్పించమని ప్రధాని మోడీ కోరనున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాని, పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పోలింగ్ గడువు దగ్గర పడుతుండడంతో ప్రతి గ్రామానికి వెళ్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. రోడ్డు షోలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో, గుర్తులను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పార్టీల అగ్ర, ముఖ్య నేతలతో పర్యటనలు నిర్వహించి శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. నగరానికి 26న ప్రధాని మోడీ రానున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ బీజేపీ అభ్యర్థి పంజా విజయ్‌కుమార్ ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ఓటర్లను తమ ఓటు బీజేపీకి వేయమని అభ్యర్థిస్తున్నారు. రోడ్డు షోలు, సమావేశాల్లో స్థానిక సమస్యలను ఏకరువు పెడుతున్నారు. యువ ఓటర్లపై దృష్టిపెట్టారు. ఈ నెల 26న ప్రధాని మోడీ పర్యటనను గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్‌లో జరుపుటకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపీ బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు నియోజకవర్గంలో పర్యటించనున్నారని నేతలు తెలిపారు.

