Home Page SliderNational

“ది ఎలిఫెంట్ విస్పరర్స్” జంటతో ముచ్చటించనున్న మోదీ

“ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఇది ఓ ఏనుగు పిల్లను పెంచుకునే వృద్ధ జంట జీవితాన్ని ఆధారం చేసుకుని తీసిన డాక్యుమెంటరీ. అయితే ఈ డాక్యుమెంటరీ ఎవరూ ఊహించని విధంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రకాల డాక్యుమెంటరీలు పాపులర్ అయ్యాకే అవార్డులు గెలుచుకుంటాయి. అయితే ది ఎలిఫెంట్ విస్పరర్స్ మాత్రం ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాకే ఎక్కువగా పాపులర్ అయ్యిందని చెప్పాలి. ఈ డాక్యుమెంటరీతో ఏనుగు పిల్లను పెంచుకున్న జంట బొమ్మన్,బెల్లీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ కూడా ఈ జంటను కలవనున్నారు. కాగా ప్రధాని మోదీ ఈ నెల 9న నీలగిరి జిల్లాలోని ముదుమలై టైగర్స్ రిజర్వ్ (MTR)ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలోనే నరేంద్ర మోదీ వృద్ద జంటను కలిసి వారితో ముచ్చటించనున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి 9వ తేది వరకూ హోటళ్లు,ఏనుగు సఫారీని మూసివేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.